పోరాడే వ్యక్తులే పార్లమెంట్ కు వెళ్లాలి : కేటీఆర్
గత ఐదేళ్లలో బీజేపీ నేత బండి సంజయ్ గల్లీలోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా కనిపించారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల తరపున పార్లమెంట్‌లో వినోద్ గళం విప్పారని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడే వ్యక్తులే పార్లమెంట్‌కు రావాలి. కేంద్రం నిధులు రాబట్టే సత్తా వినోద్‌కు ఉంది. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ 34 శాతం ధరలు పెంచారు. ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు అని అన్నారు.
Tags :