ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వైజాగ్ లో ఘనంగా జరిగిన తానా సిరివెన్నెల పుస్తకావిష్కరణ

వైజాగ్ లో ఘనంగా జరిగిన తానా సిరివెన్నెల పుస్తకావిష్కరణ

వైెజాగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాలను రెండు, మూడు భాగాలుగా ప్రచురించిన పుస్తకాలను తానా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా లేకపోయినా తెలుగువారందరి హృదయాల్లో చిరస్థాయిగా కొలువుంటారని అన్నారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ సిరివెన్నెల రరించి పలు సినీ గేయాలను చదవి వాటి అర్థాలను వివరించారు. తెలుగు సాహిత్యానికి, సమాజానిక సిరివెన్నెల చేసిన కృషిని కొనియాడారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ సిరివెన్నెలతో  తానాకు అవినాభావ సంబంధం ఉందన్నారు. సిరివెన్నెల రచించిన మొదటి పాట నుంచి చివరి పాట వరకు నాలుగు సంపుటాలుగా అందుబాటులోకి తెస్తున్నామని అందులో భాగంగా మొదటి సంపుటి ఈ ఏడాది మే నెలలో ఆవిష్కరించనట్లు తెలిపారు. ఇప్పుడు రెండు, మూడు సంపుటాలను విడుదల చేస్తున్నామని, తర్వాత నాలుగో సంపుటితో పాటు సినీయేతర సాహిత్యాన్ని రెండు సంపుటాటులుగా వెలుగులోకి తెస్తామన్నారు. తానా తరపున సిరివెన్నెల సాహిత్య పురస్కారం అందజేస్తామన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయక కర్త చిగురుమల్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మాతృభాషాభివృద్ధికి సిరివెన్నెల ఎనలేని కృషి చేశారన్నారు.  

గేయ రచయిత రామజోగ్య శాస్త్రి మాట్లాడుతూ ఆయన సమాజం పట్ల అమితమైన బాధ్యతతో ఉండేవారన్నారు.  

జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు తానా ప్రతినిధులును సిరివెన్నెల కుటుంబ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు సాయి యోగీశ్వరశర్మ, రాజా భవానీశర్మ, ప్రముఖ అవధాని రామబ్రహ్మం, శుభోధయం గ్రూప్‌ చైర్మణ్‌ డా. కలపటవు లక్ష్మీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

 

Tags :