ASBL NSL Infratech

రౌడీ జ‌నార్ధ‌న్ గా విజ‌య్?

రౌడీ జ‌నార్ధ‌న్ గా విజ‌య్?

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క‌సారిగా విజ‌య్ క్రేజ్ టూ మ‌చ్ గా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా స్టార్ కావ‌డానికి ఎన్నో ఏళ్లు వెయిట్ చేశాడు కానీ విజ‌య్ మాత్రం చాలా త‌క్కువ టైమ్ లో చాలా పెద్ద రేంజ్ కు ఎదిగిపోయాడ‌ని పొగిడాడు. అయితే విజ‌య్ కు వ‌చ్చిన ఈ ఫాలోయింగ్ ను త‌ను ఎక్కువ కాలం కాపాడుకోలేక‌పోయాడు. విజ‌య్ కు వ‌చ్చిన వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల త‌న మార్కెట్ బాగా దెబ్బ‌తింది.

విజ‌య్ నుంచి వ‌చ్చిన లాస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాలేదు. టాక్ బాలేక‌పోవ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా మిగిలింది. దీంతో ఇప్పుడు విజ‌య్ ఆశ‌ల‌న్నీ గౌత‌మ్ తిన్న‌నూరితో చేస్తున్న సినిమా మీదే ఉన్నాయి. ఇది కాకుండా దిల్ రాజు బ్యాన‌ర్ లో విజ‌య్ మ‌రో సినిమా చేస్తున్నాడు.

రాజావారు రాణి వారు ఫేమ్ ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ట‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతుంది. సైలెంట్ గా స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎలాంటి హంగామా లేకుండా ప్రొడ‌క్ష‌న్ కు వెళ్ల‌బోతుంది. ఈ సినిమాకు రౌడీ జ‌నార్ధ‌న్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ ను త‌న ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటుంటారు. ఆ పేరుతో విజ‌య్ ఓ క్లాత్ బ్రాండ్ ను కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే పేరుతో సినిమాను చేస్తున్నాడు విజ‌య్. మ‌రి ఈ సినిమా విజ‌య్ కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :