ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అనంతపురం జిల్లాలో తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు ప్రారంభం

అనంతపురం జిల్లాలో తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు ప్రారంభం

తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలకు తానా కార్యవర్గం అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా బెలుగుప్ప మండలం ఆవులెన్న  గ్రామ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తానా నాయకత్వం సహాయం చేయడం జరిగింది. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ గుదే పురుషోత్తం చౌదరి తన మిత్రులతో కలిసి వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన 10 లక్షల రూపాయలు సమకూర్చడం జరిగింది. వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయిన సందర్భంగా తానా కార్యవర్గం స్థానిక శాసనసభ్యులు శ్రీ పయ్యావుల కేశవ గారిచే నేడు ప్రారంభించడం జరిగింది. గ్రామ ప్రజలు, వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సహకరించిన తానా కార్యవర్గ సభ్యులను అభినందించి పూలమాలలతో సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ఇట్టి గ్రామ ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ఎల్లవేళలా ముందుంటామని హామీ ఇచ్చారు. వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సహకరించిన తానా ఫౌండేషన్‌ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ ఆవులెన్న గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అనంతపురం జిల్లా ప్రజల సమస్యలు తీర్చడానికి తానా తరపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, 23వ తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌ పంట్ర, రైతు కోసం కో చైర్‌ రఘు ఎద్దులపల్లి, వెంకట్‌ మాలపాటి, పీ.వీ.కే.కే కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుబ్బారావు, గ్రామ సర్పంచ్‌ రామ్మోహన్‌ అండ్ర, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

తానాచైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌ పంట్రా మాట్లాడుతూ ఆవులెన్న గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా చైతన్య స్రవంతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమాలు నేడు అనగా 2-12-2022 నుండి జనవరి 7, 2023 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం తానా కార్యవర్గము కళ్యాణదుర్గం పట్టణంలోని జ్ఞాన భారతి విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన తానా చేయూత కార్యక్రమంలో భాగంగా 35 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా చేయుత ద్వారా దాదాపు 1000 మందికి పైగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ తానా చేయూత కార్యక్రమానికి తానా ఫౌండేషన్‌ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి తన తండ్రి గుదె వెంకటరామప్ప గారి జ్ఞాపకార్థం మూడు లక్షల, 50 వేల రూపాయలు 30 మంది విద్యార్థులకు సహాయం అందించడం జరిగింది. ఆర్థిక సహాయం అందుకున్న విద్యార్థులు, ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు, చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, ఫౌండేషన్‌ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ సునీల్‌ పంట్ర మరియు జ్ఞాన భారతి విద్యాసంస్థల యాజమాన్యం శ్రీ రమేష్‌ బాబు మోదుపల్లి గారికి తానా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తరిమెళ్ళ రాజు నేతృత్వంలో కళాకారుల బృందం సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన భారతి విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వీక్షకులకు కార్యక్రమానికి వన్నెలు దిద్దారు. 


Click here for PhotoGallery

 

 

Tags :