ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఘనంగా సాగిన తామా వారి సంక్రాంతి వేడుకలు

ఘనంగా సాగిన తామా వారి సంక్రాంతి వేడుకలు

అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జనవరి 16న నగరంలోని మిడ్‌క్య్రూలో జరిగిన ఈ సంబరాలకు ఎంతోమంది హాజరయ్యారు. మాగ్నం ఓపస్‌ ఐటీ వారు తామా సాంస్కృతిక కార్యదర్శి వెంకి గద్దె సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. కార్యవర్గ సభ్యులను, బోర్డుల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన చేశారు. వెంకిగద్దె, యాంకర్‌ రాజేశ్వరి ఉదయగిరి, గాయకులు పారిజాత, ప్రవీణార్థని సభకు పరిచయం చేసి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. పిల్లల ఆటపాటలతో, యువత సాంస్కృతిక ప్రదర్శనలతో కూచిపూడి నాట్యప్రదర్శనతో కార్యక్రమం పతాకస్థాయికి చేరుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ద్రువీకరణ పత్రాలు బహూకరించారు.

అధ్యక్షుడు వెంకట్‌ మీసాల 2016 కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. హర్ష ఎర్నేని (ఉపాధ్యక్షుడు), మనోజ్‌ తాటికొండ (ప్రధాన కార్యదర్శి), భరత్‌ మద్దినేని (కోశాధికారి), వెంకి గద్దె (సాంస్కృతిక కార్యదర్శి), మురళి బొడ్డు (విద్యా కార్యదర్శి), మధుకర్‌ నంటేటి (సాహిత్య కార్యదర్శి), రాజేష్‌ తడికమళ్ళ (మీడియా కార్యదర్శి), రామ్‌ బస్‌రెడ్డి (సాంకేతిక కార్యదర్శి), ప్రియ బలుసు ఈవెంట్‌ కార్యదర్శి, ఇన్నయ్య ఎనుముల (క్రీడా కార్యదర్శి)ని పరిచయం చేశారు. బోర్డ్‌ చైర్మన్‌ రామ్‌ మద్ది, బోర్డ్‌ సభ్యులు మహేష్‌ పవార్‌ (కార్యదర్శి), అప్పారావు గోపు, వెంకట్‌ అడుసుమిల్లి, కృష్ణ బొజ్జ, సుబ్బారావు మద్దాలి, నాగేశ్వరరావు దొడ్డాక, వినయ్‌ మద్దినేని, రామ్‌కి చౌడరపు, రాము పారుపల్లి తదితరులను సభకు పరిచయం చేసి తామా దీర్ఘకాలిక కార్యక్రమాలు, స్కాలర్‌షిప్స్‌, ఉచిత క్లినిక్‌ తదితర వివరాలను సభికులకు తెలియజేశారు. ఈ వేడుకలను సమర్పించిన మ్యాగ్నం ఓపస్‌ ఐటీ కార్యనిర్వహణ అధికారి సాగర్‌ లగిసెట్టిని వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

బోర్డు సభ్యుడు నగేష్‌ దొడ్డాక తామా క్లినిక్‌ ప్రాధాన్యం, సేవల వివరాలను సభకు తెలియజేసి, ఆర్థిక చేయూతను ఇవ్వాలని కోరారు. క్లినిక్‌కు ఆర్థిక సహాయం అందించిన హనుమాన్‌ నందనంపాటిని బోర్డు కార్యదర్శి మహేష్‌ పవార్‌, ఘనంగా సన్మానించి మెమోంటోనూ బహూకరించారు. తామా క్లినిక్‌ లాంటి గొప్ప సేవా కార్యక్రమానికి అందరూ సహాయపడి ప్రతిరోజు నిర్వహించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరారు.

ప్రముఖ దర్శకుడు విఎన్‌ ఆదిత్యను ఈ వేడుకల్లో ఘనంగా సత్కరించారు. ఆదిత్య మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న తామా వారిని అభినందించారు. ముందుగా నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు విజయ కలెక్షన్స్‌ వారి తరపున, రాఫిల్‌ డ్రా విజేతలకు, శ్రేయాన్స్‌. కమ్‌ వారు టేస్ట్‌ ఆఫ్‌ ఇండియా వారి తరపున బహూమతులను ప్రదానం చేశారు. రాజేశ్వరి ఉదయగిరి వ్యాఖ్యానం, గాయనీ గాయకులు పారిజాత, ప్రవీణ్‌, సందీప్‌ కౌతా, హరిణి ఆలపించిన సినీ గీతాలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శ్రీనివాస్‌ లావు, అనిల్‌ యలమంచిలి, అంజయ్య చౌదరి లావు, సురేష్‌ వోలం, కార్తీక్‌ పాలడుగుల, సత్విక్‌ దుద్దిళ్ళ, కార్తీక్‌ ఇనగంటి, సంఘమిత్ర వోలం, శ్రీలాస్య వోలం, రాకేష్‌ కున్నత్‌, రాజ్‌ చింతగుంట, రాజేష్‌ అలగందుల, క్రాంతి రెడ్డి బూదిద, మౌనిష్‌ జంపాల, రాజేష్‌ జంపాల, రవి అనిర్నెని, దిలీప్‌ గంద్ర, అభిలాష్‌ దర్శన్‌, చంద్రన్‌ బ్రిష్నన్‌, ప్రశాంత్‌ పొద్దుటూరి, ప్రశాంత్‌ వీరబొమ్మ, కిషోర్‌ తాటికొండ, క్రాంతి బూడిద, గణేష్‌ కాసం, ఫోటోగ్రపి అందించిన వాకిటి క్రియేషన్స్‌ వారికి ఆడియో, లైటింగ్‌ అందించిన సురేష్‌ కరోతుకు, మంచి కార్యక్రమాలను అందించిన అట్లాంటా డ్యాన్స్‌ స్కూల్‌ వారికి ఇతరులకు ఉపాధ్యక్షుడు హర్ష ఎర్నెని ధన్యవాదాలు తెలియజేశారు. హాట్‌ బ్రెడ్స్‌వారు అందించిన రుచికరమైన భోజనాలతో కార్యక్రమాలు ముగిశాయి.

Click here for Event Gallery

 

Tags :