ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూఎస్ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి విజయం

యూఎస్ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు తమ సత్తాను చాటారు. తమిళనాడుకు చెందిన రాజా కృష్ణమూర్తి డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఇల్లినాయిస్‌ రాష్ట్రం నుంచి యూఎస్‌ హౌస్‌కు ఎంపికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌కు వెళ్లబోతున్న తొలి తమిళ వ్యక్తి రాజా కృష్ణమూర్తి కావడం విశేషం. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు వెళ్తున్న తొలి భారత సంతతి హిందూ వ్యక్తి కూడా ఆయనే. రాజా కృష్ణమూర్తి మూడు నెలల వయసులోనే కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. ఆయన ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి జ్యూరిస్‌ డాక్టరేట్‌ తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం శివనాథన్‌ ల్యాబ్‌ అండ్‌ ఎపిసోలార్‌ కంపెనీ ప్రెసిడెంట్‌. 2004లో ఒబామా ప్రచార కార్యక్రమంలో ఇష్యూ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇన్‌స్పైర్‌ అనే ఎన్జీవో స్థాపించి సోలార్‌ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

 

 

Tags :