ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బోస్టన్ ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం లో నారా లోకేష్

బోస్టన్ ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం లో నారా లోకేష్

అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ ఆదివారం బోస్టన్ లో మోహన్‌ నన్నపనేని ఆధ్వర్యంలో జరిగిన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశానికి హాజరయి ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వాములు అవ్వాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమానికి స్టాంఫోర్డ్, ఎంఐటీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, పలు కంపెనీల సిఈఓ లు మరియు డల్లాస్, కెనడా, న్యూజెర్సీ, చికాగో, అల్బానీ నగరాల నుండి విచ్చేసిన ఎన్నారై టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించడం కోసం తీసుకున్న నిర్ణయాలు, పాలసీలతో పెద్ద కంపెనీలు మనరాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నారై లు అంతా భాగస్వాములే కాకుండా ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్రప్రదేశ్ కి అంబాసిడర్‌లు మరాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకొంటున్న విధానాలవల్ల దేశంలోనే జీడీపీలో అగ్రపదాన దూసుకుపోతుంది అన్నారు, ఇంకా ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను ఎన్నారై లకి మంత్రి లోకేష్ వివరించారు.

ఈ కార్యక్రంలో పాల్గొన్న మోహన్‌ నన్నపనేని, మురళి వెన్నం, సాంబ దొడ్డ, దినేష్ త్రిపురనేని, అనిల్ లింగమనేని, జనార్దన్ యెనికపాటి, శశికాంత్ వల్లేపల్లి, ప్రవీణ్‌ కొడాలి, అనిల్ కుర్రా, రాజా నల్లూరి, రఘు కొర్రపాటి, సుధాకర్ కొర్రపాటి తదితరులు మంత్రి లోకేష్ గారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

 

Tags :