ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో లోకేష్ భేటీ

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో లోకేష్ భేటీ

రాష్ట్రంలో వ్యవసాయరంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టే విషయమై  బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ అగ్రికల్చర్‌ డెవల్‌ప్‌మెంట్‌ డైరక్టర్‌ నిక్‌ ఆస్టిన్‌, ఇతర ప్రతినిధులతోనూ లోకేశ్‌ సమావేశమై డిజిటల్‌ వ్యవసాయంపై చర్చించారు. గ్రామీణాభివద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్‌ కోరారు. చిన్నారులలో పోషకాహార లేమితో వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేలా రైస్‌ పోర్టిఫికేషన్‌లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

గేట్స్‌ ప్రతినిధులు అందుకు సానుకూలత వ్యక్తం చేశారు. అమెజాన్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలీ ఉపాధ్యక్షుడు మైకేల్‌ పంక్‌తో కూడా లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏపీలో క్లౌడ్‌ సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెజాన్‌ను ఇండియాలో విస్తరించే ఆలోచన ఉంటే తమ రాష్ట్రంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మైకేల్‌ స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న తమ బందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామన్నారు. వాషింగ్టన్‌ స్టేట్‌ ఇండియా ట్రేడ్‌ రిలేషన్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ పాల్గొన్న లోకేశ్‌... ఆ ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించారు.

 

Tags :