ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఈ ఎన్నికల్లో వైకాపాకు బుద్ది చెప్పాలి : లోకేశ్

ఈ ఎన్నికల్లో వైకాపాకు బుద్ది చెప్పాలి : లోకేశ్

టీడీపీ అభ్యర్థులకు కేటీఆర్‌ ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే భూములు లాక్కుంటామని హెచ్చరిస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో లోకేశ్‌ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన ముఖ్యమంత్రి ఏపీలో అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు ఆపేయొచ్చని, ముంపు మండలాలు వెనక్కి తీసుకోవచ్చని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మన బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించాలని చూస్తున్నారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. కేసీఆర్‌తో కలిసిన జగన్‌ను వాళ్ల కార్యకర్తలు నిలదీయాల్సి ఉంది. కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే ఏమైందని జగన్‌ వ్యాఖ్యానించారు. మనం ఎలా ఊరుకుంటాం. ఈ ఎన్నికల్లో వైకాపాకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

పసుపు-కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపిద్దామా? పసుపు-కుంకుమ చెరిపేసిన వ్యక్తిని గెలిపిద్దామా? చంద్రన్న పెళ్లి కానుక, తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వంటి దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 2014కు ముందు ఎండకాలం వస్తే భయపడవారు. కరెంటు ఎప్పుడు పోతుందో అని. ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. ఒకవైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి, టీడీపీకి జోడెద్దుల బండి అని అన్నారు.

 

Tags :