ASBL NSL Infratech

ప్ర‌స‌న్న‌వ‌ద‌నం ఏదో గ‌ట్టి పాయింటే ఉన్న‌ట్టుందే!

ప్ర‌స‌న్న‌వ‌ద‌నం ఏదో గ‌ట్టి పాయింటే ఉన్న‌ట్టుందే!

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ లిమిటెడ్ బ‌డ్జెట్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోల్లో ఒక‌డిగా త‌న‌ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు సుహాస్. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఇయ‌ర్ రిలీజైన సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయి లాభాలు తెచ్చిన వాటిలో సుహాస్ హీరోగా వ‌చ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు కూడా ఉంది. మొన్నీమ‌ధ్యే శ్రీరంగ నీతులు రిలీజైంది కానీ అది వచ్చిన విష‌యం కూడా ఎవ‌రికీ తెలీలేదు.

ఇప్పుడు వ‌చ్చే నెల 3న ప్ర‌స‌న్న‌వ‌ద‌నం సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు సుహాస్. ప్ర‌మోష‌న్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ సంస్థ‌, క‌న్న‌డ‌లో హోంబ‌లే ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ప్ర‌స‌న్న‌వ‌ద‌నంలో ఏదో స్ట్రాంగ్ కంటెంటే ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

మొఖాలు మ‌ర్చిపోయే చిత్ర‌మైన జ‌బ్బుతో బాధ‌ప‌డే వ్య‌క్తిగా సుహాస్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన ప్ర‌చార కంటెంట్ సినిమాపై అంచ‌నాల్ని పెంచుతుంది. ఎప్ప‌టిలా ఎమోష‌న్స్, ల‌వ్ జోలికి వెళ్ల‌కుండా సుహాస్ ఈసారి థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో ఈ ప్ర‌యోగాన్ని చేస్తున్నాడు. మేక‌ర్స్ మాత్రం సినిమా క‌చ్ఛితంగా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు. దానికి తోడు డిస్ట్రిబ్యూష‌న్ లో పెద్ద‌ల అండ కూడా దొరికింది. ఈ సినిమా హిట్ అయితే సుహాస్ మార్కెట్ తో పాటూ రేంజ్ కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈ హిట్ త‌న త‌ర్వాతి సినిమాల బిజినెస్ కు కూడా బాగా ఉప‌యోగ‌ప‌డే ఛాన్సుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :