ASBL NSL Infratech

కేశ‌వ పాత్ర సుహాస్ చేయాల్సింద‌ట‌

కేశ‌వ పాత్ర సుహాస్ చేయాల్సింద‌ట‌

సుహాస్ కొత్త సినిమా ప్ర‌స‌న్న‌వ‌ద‌నం మే నెల 3వ తేదీన రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ ఈవెంట్ కు డైరెక్ట‌ర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు. ప్ర‌స‌న్న‌వ‌ద‌నంను మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండ‌టంతో గెస్టుగా సుకుమార్ రావ‌డంలో ఆశ్చ‌ర్యేమేమీ లేదు. పైగా ఈ సినిమా డైరెక్ట‌ర్ అర్జున్, సుకుమార్ కు శిష్యుడు.

అయితే ఈ ఈవెంట్ లో సుకుమార్ సుహాస్ ను ఉద్దేశించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పుష్ప సినిమాలో జ‌గ‌దీష్ చేసిన కేశ‌వ పాత్ర కోసం ముందుగా తాను సుహాస్ నే అనుకున్నాన‌ని, కానీ సుహాస్ అప్ప‌టికే హీరోగా న‌టిస్తున్నాడ‌ని తెలిసి డ్రాప్ అయ్యాన‌ని, హీరో అల్లు అర్జున్ కు కూడా సుహాస్ మీద స్పెష‌ల్ ఇంట్రెస్ట్ ఉన్న విష‌యాన్ని సుకుమార్ బ‌య‌ట పెట్టాడు.

రీజ‌న్ ఏదైనా స‌రే, సుకుమార్ తీసుకున్న డెసిషన్ అటు పుష్ప సినిమాకు, ఇటు సుహాస్ కు ఇద్ద‌రికీ మంచే చేసింది. బ‌న్నీ సినిమా, పెద్ద ఆఫ‌ర్ క‌దా అని సుహాస్ ఒక‌వేళ ఒప్పుకుని ఉంటే ఇప్పుడు పుష్ప‌2లో కూడా బ‌న్నీకి అసిస్టెంట్ గా చేయాల్సి వ‌చ్చేది. సోలో హీరోగా ఓ ఇమేజ్ వ‌చ్చాక అలాంటి పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల సుహాస్ మార్కెట్ దెబ్బ తినే అవ‌కాశ‌ముంది. పైగా సుకుమార్ కూడా సుహాస్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో మార్పులు చేయాల్సి వ‌చ్చేది. అలా చేయ‌డం వ‌ల్ల క‌థ‌లో ఒరిజినాలిటీ దెబ్బ‌తినే అవ‌కాశ‌ముంది. పైగా జ‌గ‌దీష్ లాగా సుహాస్ ఫేస్ క‌రుకుద‌నం ఉండ‌దు. కాబ‌ట్టి సుకుమార్ తీసుకున్న డెసిష‌న్ ఇద్ద‌రికీ మంచే చేసింది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :