ASBL NSL Infratech

డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం

డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ఔత్సాహికులు

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక  కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో నృత్య, నటన, శిక్షణ శిబిరం నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అవర్ కిడ్స్ మాంటిస్సోరిలో  రోబో గణేశన్ నృత్య, నటన శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరంలో 20 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొని  రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగలలో శిక్షణ పొందారు. ఎంతో మంది ఔత్సాహికులు ఈ శిక్షణా శిబిరంలో నృత్యం, నటనలోని మెళుకువలు నేర్చుకున్నారు. తమలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు.. ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా నిర్వహించిన రోబో గణేశ్‌ని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, ఇతర డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని, తదితరులను బాపు నూతి ప్రత్యేకంగా ప్రశంసించారు. డల్లాస్‌లో తెలుగువారి కోసం ఇంత చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :