ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

‘అడ్వాంటేజ్ ఏపీ’ హిట్.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల రాక

‘అడ్వాంటేజ్ ఏపీ’ హిట్.. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల రాక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్‌ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ అంచాలకు మించి విజయవంతమైంది. విశాఖ వేదికగా జరిగిన సదస్సులో తొలి రోజే భారీ పెట్టుబడులు వచ్చాయి. రెండవరోజు మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. ఒప్పందాలు కూడా పూర్తికావడంతో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో సీఎం జగన్‌తోపాటు ప్రభుత్వ పెద్దల్లో కూడా రెట్టించిన ఉత్సాహం కనిపించింది. సదస్సుకు ముందు ప్రభుత్వం అంచనావేసిన విధంగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు రావడంతో  సమ్మిట్‌ నూటికి నూరు శాతం విజయ వంతం అయినట్లయింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్‌ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నాయి.

రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ ముఖేష్‌ అంబానీతో పాటు కరణ్‌ అదానీ, జిందాల్‌, బంగూర్‌, ఒబెరాయ్‌, భజాంకా, దాల్మియా, మిట్టల్‌, జీఎం రావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్‌ రెడ్డి, బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, మసహిరో యమ­గుచి, టెస్లా కోఫౌండర్‌ మార్టిన్‌ ఎబర్‌హార్డ్‌ వంటి 30కిపైగా కార్పొరేట్‌ దిగ్గజాలు హాజరయ్యాయి. అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత ప్రభుత్వాల వలే ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి.. సీఎస్‌ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు తీరు, అనుమతుల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమావేశాల సందర్భంగా 15 రంగాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇందులో ఆయా రంగాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొని చర్చించారు. పలు దేశాల్లో ఉన్న పరస్పర పెట్టుబడుల అవకాశాలపై వియత్నాం, నెదర్లాండ్స్‌, యూఏఈ, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా దేశాలతో కంట్రీసెషన్స్‌ జరిగాయి. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 137 స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో జిల్లాల వారీగా ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉత్పత్తుల స్టాల్‌ విశేషంగా ఆకర్షించింది. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులతో పాటు మొత్తం 14,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రంలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైన 14 యూనిట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, శర్బానంద సోనోవాల్‌ సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యూనిట్ల ప్రారంభం ద్వారా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడమే కాకుండా 9,108 మందికి ఉపాధి లభించనుంది. క్లింబెర్లీ క్లార్క్‌, బ్లూస్టార్‌, అంబర్‌, హావెల్స్‌, ఎక్సలెంట్‌ ఫార్మా, ఎన్‌జీసీ టాన్స్‌మిషన్స్‌, చార్ట్‌ ఇండస్ట్రీస్‌, లారస్‌ ల్యాబ్‌, అమరా లైఫ్‌, శారదా ఫెర్రో అల్లాయిస్‌, విన్‌విన్‌ స్పెషాలిటీ, ఏవోవీ ఆగ్రో ఫుడ్స్‌, ఎస్‌హెచ్‌ ఫుడ్‌, అవేరా కంపెనీలున్నాయి.

ఒక్క మాట... ఒక్క నిర్ణయం

జీఐఎస్‌ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన రెండు మాటలు యావత్‌ పారిశ్రామిక ప్రపంచానికి భరోసానిచ్చాయి. ఎంవోయూల మేరకు పరిశ్రమల స్థాపనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనకు ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు పరిష్కరిస్తానని స్పష్ట­మైన హామీనిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి భరోసానివ్వలేదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వేగంగా ఎంవోయూల సాకారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో అత్యున్నత కమిటీని నియమిస్తున్నట్లు సీఎం జగన్‌ చేసిన ప్రకటన పెట్టుబడిదారుల్లో ఆత్మ విశ్వా­సాన్ని పెంపొందించింది. అటు ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్‌ కాల్‌ దూరంలో అందుబాటులో ఉండటం... ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం పరిశ్రమల ఏర్పాటును పర్యవేక్షించనుండటం విధానపరంగా విప్లవాత్మక నిర్ణయాలనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.

సత్వర నిర్ణయాలు, సమర్థ నాయకత్వం

జీఐఎస్‌ 2023 సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడులను సాధించడం ద్వారా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని రుజువు చేసుకుంది. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఎంతో కాలయాపన తరువాతగానీ నిర్ణయం తీసుకోని అగ్ర పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో పెట్టుబడుల విషయంలో మీనమేషాలు లెక్కించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సత్వరం సానుకూలంగా స్పందించి ఏకంగా 20 రంగాల్లో 378 పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ సమర్థ నాయకత్వం ఉందన్న నమ్మకమే దీనికి కారణం. విశ్వసనీయత, సమర్థత, సత్వర నిర్ణయాలకు సీఎం జగన్‌ను ప్రతీకగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. కోవిడ్‌ సమయంలో పరిశ్రమలకు అండగా నిలవడంతోపాటు గత మూడున్నరేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధిని కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. 

352 ఎంఓయూలు.. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు..

ఏపీ గ్లోబల్‌లో ఇన్వెస్టర్స్‌ సదస్సులో సునామీలా పెట్టుబడులు వెల్లువెత్తాయి. సుమారుగా 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఏపీ ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేం చూపిన ధృఢమైన నిబద్ధత కారణంగా, సానుకూల వ్యాపార పరిస్థితులు కారణంగా ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాం. 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఐటీ, ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నాం. వీటి విలువ రూ.25,587 కోట్లు. 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయి.

టూరిజంకు 117 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయి.

ఈ సదస్సు వేదికగా రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కింబర్లే క్లార్క్‌, బ్లూస్టార్‌, క్ల్కెమాటెక్‌, లారస్‌ ల్యాబ్‌, హేవెల్స్‌ఇండియా, శారదా మెటల్స్‌ మరియు అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణం అన్నారు.

గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్‌ఎనర్జీని నేను గట్టిగా చెప్పగలను అని సీఎం జగన్‌ అన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్‌ స్ట్టోరేజీ మరియు గ్రీన్‌ హైడ్రోజన్‌ మరియు గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయని, శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయన్నారు. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్‌ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్‌కు తన లక్ష్య సాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయన్నారు.

 

 

Tags :