ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

13 లక్షల కోట్ల పెట్టుబడులు.. – జగన్..

13 లక్షల కోట్ల పెట్టుబడులు.. – జగన్..

విశాఖపట్నం – ఎపికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వాటి ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి లభించనుందని ఎపి ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమీట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి విశాఖలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇన్వెస్టర్ల సమ్మిట్ కు వచ్చిన మహా దిగ్గుజ్జాలకు నా అభినందనలు. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరగడం చాలా గర్వంగా ఉంది ఎపికి 13 లక్షల కోట్ల రూ పెట్టు బడులు వస్తున్నాయని గర్వంగా ప్రకటిస్తున్న.. ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 92 ఎంవోయులు కుదుర్చు కుంటున్నాం అలాగే 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.. తొలి రోజునే 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. 8.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయులు మొదటి సమ్మిట్ ఈరోజు జరుగుతాయి. మిగిలిన కొన్ని ఎంవోయులు రేపు శనివారం జరుగుతాయి, విశాఖ చిన్న ఏకానిమిక్ హబ్ మారుతుంది. ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ సదుపాయాలకు భిన్నంగా రాష్ట్రం ఉంది. ముఖ్యమైన జి 20 సదస్సు కు విశాఖ వేదిక గా నిలిచింది. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఒక్క ఫోన్ కాల్ తో సమస్యలు పరిష్కరిస్తాము. భవిష్యతులో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని అన్నారు.

 

 

Tags :