ఇండియాలోనే ఆపిల్ మ్యాక్ బుక్స్
ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ తయారీ చైనా నుంచి ఇండియాకు మారిన విషయం మనందరికి విదితమే. తమిళనాడు కేంద్రంగా ఉత్పత్తికి కసరత్తు జరుగుతున్న వేళ త్వరలోనే మరిన్ని ఆపిల్ ఉత్పత్తులు ఇండియాలో తయారయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను తెస్తున్నట్లు తెలుస్తోంది. హార్డ్‌వేర్ కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం పెంచాలని కేంద్రం యోచిస్తోంది. గతంలో ఉన్న ప్రోత్సహకాలను రూ. 7,380 కోట్ల నుంచి దాదాపు రూ. 20 వేల కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆపిల్ తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ తయారీని భారత్ కేంద్రంగా నిర్వహించవచ్చని తెలుస్తోంది. చైనా-ప్లస్ వన్ స్ట్రాటజీని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో ఆపిల్ తన తయారీ పర్యావరణ వ్యవస్తను పెంచాలని ప్రభుత్వం కోరుకుంటుందోంది.






