వచ్చే ఏడాది నుంచి ఈ కార్లు కనిపించవు!
భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని వాహనాలు రోడ్డెక్కడానికి వీల్లేకుండా పోతుంది. రియల్ టైం ఎమిషన్ లేదా ఆర్డీఈ నిబంధనలను ప్రభుత్వం అమలు చేయనుంది. వీటిని బీఎస్6 ఉద్గార నిబంధనల్లో రెండో దశగా చెప్తున్నారు. ఈ రూల్స్ వల్ల చాలా కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నాయట. అలాగే పెట్రోల్ కార్లలో కూడా కొన్ని మార్పులు చేయక తప్పని పరిస్థితి. సాధారణంగా కారులో నుంచి వచ్చే ఎమిషన్స్ను ల్యాబులో కొలుస్తారు. అయితే అవి రోడ్డెక్కిన తర్వాత విడుదల చేసే ఉద్గారాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వీటిని కొలిచేందుకు కార్లలో కొత్త డివైజులను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ భారం డీజిల్ వాహనాలపై ఎక్కువగా ఉండటంతో ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలని కార్ల కంపెనీలు భావిస్తున్నాయట. ఈ లిస్టులో ఉన్న కొన్ని పాపులర్ కార్లు ఏవంటే?
హ్యుండాయ్ ఐ20 డీజిల్, వెర్నా డీజిల్
టాటా ఆల్ట్రోజ్ డీజిల్
మహీంద్ర మరాజో, ఆల్టురాజ్ జీ4, కేయూవీ100
స్కోడా ఓక్టేవియా, సూపర్బ్
రెనాల్ట్ క్విడ్ 800
నిస్సాన్ కిక్స్
మారుతి సుజుకీ ఆల్టో 800
టొయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్
హోండా సిటీ 4వ జనరేషన్, 5వ జనరేషన్ డీజిల్, అమేజ్ డీజిల్, జాజ్, డబ్ల్యూఆర్-వీ






