ఉద్యోగులకు టెక్ మహీంద్ర బంపర్ ఆఫర్
ఉద్యోగులకు టెక్ మహీంద్ర బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్టాక్ ఆప్షన్లుగా రూ. 6. లక్షల కంటే ఎక్కువ విలువైన ఈక్విట్రీ షేర్లను ఉద్యోగులకు అందించనుంది. ఈఎస్ఓపీ షేర్లు ఒక్కొక్కటి రూ.5 చొప్పున మొత్తం రూ.6,15,525కి షేర్లను అందించనుంది. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల కింద 1,23,105 ఈక్విటీ షేర్లను అందజేస్తున్నట్లు టెక్ మహీంద్రా ఎక్స్జేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. మొత్తం రూ.6,15,525 విలువైన షేర్లను వారికి కేటాయిస్తున్నట్టు తెలిపింది. కాగా టెక్ మహీంద్రా ఆగస్టులో ఈఎస్ఓపీ ఒక్కొక్కటి రూ.5 చొప్పున 1.05 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఇష్యూలు 97,36,27,243గా ఉంటాయి. ఇది మొత్తం రూ.486 కోట్లకు చేరుకుంది.






