ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా స్వామినాథన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీ స్వామినాథన్ జానకిరామన్ను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేశ్ కుమార్ జైన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నియామకాన్ని చేపట్టింది. పదవీ కాలంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు నెలకు రూ.2.5 లక్షల వేతనం ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మహేశ్ కుమార్ జైన్ పర్వవేక్షణ విభాగం, ఆర్థిక సమ్మిళతరం, అభివృద్ధి విభాగం చూస్తున్నారు. జానకిరామన్కు ఇవే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.






