మరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) మరోసారి రెపో రేటును పెంచింది. ఆర్బీఐ మరో 35 బేసిస్ పాయింట్లు పెంచింది. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. 6. 25 శాతానికి రేపో రేటు పెరిగిందని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో రేట్ల పెంపు వేగాన్ని ఈసారి ఆర్బీఐ కాస్త తగ్గించింది. తాజా పెంపుతో అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి. అయితే దేశంలో దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన ఒక రీసెర్చ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఆర్బీఐ డిసెంబరులో స్వల్పంగా వడ్డీ రేట్టు పెంచే అవకాశముందని, 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరగొచ్చని, 6.25 శాతంగా రెపో రేటు ఉండొచ్చని ముందుగానే వివరించింది.






