రిలయన్స్ గ్రూప్ లో కీలక పరిణామం
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం చేసుకుంది. గ్రూప్ ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మను నియమించింది. జూన్ 20 నుంచి ఆమె నియామకం అమల్లోకి వచ్చింది. కమ్యూనికేషన్ వ్యూహకర్తగా మంచి అనుభవం ఉన్న శర్మ నియామకంతో కంపెనీ పునర్వైభవాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నారు. గ్రూప్ కార్పొరేట్ ఇమేజ్, పబ్లిసిటీ, రిలేషన్ షిప్‌లతో సహా రూపర్ట్ మర్దోక్ యాజమన్యాంలోని స్టార్ ఇండియాలో 15 సంవత్సరాల పాటు పని చేశారు. అలాగే కొలోన్‌లో ఉన్న జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డ్యుయిష్ వెల్లేలో పని చేవారు. పారుల్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా చేరడంపై సంతోషాన్ని ప్రకటించారు అనిల్ అంబానీ. గ్రూప్‌తో ఇది ఆమెకు తొలి వృతిపరమైన అనుబంధమే అయినా, టోనీ భార్యగా విస్తృత రిలయన్స్ కుటుంబంలో భాగమేననీ, టోనీ జ్ఞాపకాలు, సేవలు పారుల్ చేరితో మరింత ప్రత్యేకంగా నిలుస్తాయని అనిల్ అంబానీ తెలిపారు.






