గూగుల్ కు షాక్… జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలి
కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఎల్) విధించిన రూ.1337.76 కోట్ల జరిమానాలో 10శాతం మొత్తాన్ని చెల్లించాలని ది నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) గూగుల్‌ను ఆదేశించింది. గూగుల్ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు సభ్యులు బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇతరుల వాధనలు కూడా విన్నాక పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది. ఆండ్రాయిడ్ మొబైల్ విభాగంలో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ గతేడాది అక్టోబర్‌లో గూగుల్‌కు సీసీఐ రూ.337.76 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని సూచించింది. దీనిపై గూగుల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. పెనాల్టీపై స్టే విధించించాలని కోరింది. దేశంలో ఎలాంటి విచారణా జరపకుండా యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సీసీఐ డైరెక్టర్ జనరల్ కాపీ కొట్టారని తీవ్ర ఆరోపణలు చేసింది. కాబట్టి సీసీఐ ఆదేశాలను కొట్టివేయాలని కోరింది. అయితే గూగుల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ట్రైబ్యునల్ స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.






