సుప్రీంకోర్టును ఆశ్రయించిన గూగుల్
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వధించిన 1338 కోట్ల అపరాధ రుసుంపై స్టే ఇవ్వడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీసీఐ విధించిన జరిమానాలో 10 శాతం చెల్లించాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. గతంలో యూరోపియన్ యూనియన్ తమపై జారీ చేసిన ఆదేశాల నుంచి కొన్ని భాగాలను సీసీఐ కాపీ చేసిందని గూగుల్ తన పిటిషన్లో ఆలోపించింది. సీసీఐ ఆదేశాలు అసాధారణమైనవని, తప్పుల తడకలుగా ఉన్నాయని గూగుల్ పేర్కొన్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ ఓపెన్ సిస్టమ్ కారణంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటు ధరలో లభిస్తున్నాయని, దాదాపు 1100 ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదార్ల (ఓఈఎమ్‌లు) 15 వేలకు పైగా స్మార్ట్పన్ మోడళ్లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చామని గూగుల్ వాదించనుంది. భారత్‌లో ఆండ్రాయిడ్ ద్వారా తనకున్న గుత్తాధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందని గత సంవత్సరం అక్టోబర్‌లో సీసీఐ 1337.76 కోట్ల రూపాయల అపరాధ రుసుం విధించింది. దీనిపై స్టే ఇవ్వాలని గూగుల్ ఎన్సీఎల్టీకి వెళ్లింది. అక్కడ గూగుల్‌కు చుక్కెదురైంది. దీంతో ఎన్సీఎల్ఏ టీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గూగుల్ స్రుప్రీం కోర్టును ఆశ్రయించింది.






