డేటా సెంటర్ లపై పెరిగిన పెట్టుబడులు
దేశంలో డేటా సెంటర్లపై 2020 నుంచి ఇప్పటి వరకు 81,247 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో డేటా వినియోగం భారీగా పెరగడంతో ఈ సెంటర్లకు డిమాండ్ పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలిరిస్ ఇండియా తెలిపింది. 2025 నాటికి దేశంలో డేటా సెంటర్లు 20 మిలియన్ చదరపు అడుగులకు మించి ఉంటాయని పేర్కొంది. ప్రస్తుత సామర్ధ్యం 10.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. మన దేశంలోని ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూర్, చెన్నయ్, హైదరాబాద్, పూణే, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో 770 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి.






