ప్రభావశీలుర మహిళల జాబితాలో తెలుగమ్మాయి
ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావశీలుర మహిళల జాబితాను బీబీసీ ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఏరోనాటికల్ ఇంజినీర్ అయిన తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం. భారత్ నుంచి నటి ప్రియాంక చోప్రా, రచయిత్రి గీతాంజలి శ్రీ, సామాజిక కార్యకర్త స్నేహ జావాలే జాబితాలో ఉన్నారు. శిరీష బండ్ల 2021 లో చారిత్రక యూనిటీ 22 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. భారత్లో జన్మించిన అంతరిక్షంలోకి వెళ్లిన రెండో మహిళ ఆమె. పురుషాధిక్య రంగంలో శిరీష తన పట్టుదలతో రాణిస్తూ కొత్త చరిత్ర లిఖిస్తున్నారు.






