Donald Trump : వెయ్యి డాలర్లు చెల్లిస్తే తొందరగా.. నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ!
అమెరికా నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూల్లో ప్రీమియం ప్రాసెస్ విధానం తీసుకొచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు యత్నాలు మొదలుపెట్టింది. ఈ వీసా (Visa)ల ఇంటర్వ్యూల కోసం ఏళ్లతరబడి ఎదురుచూడకుండా, ఓ ప్రత్యేక విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఆ మేరకు 1,000 డాలర్లు చెల్లించినవారికి వీసా ఇంటర్వ్యూ (Interview ) వేగంగా ఏర్పాటు చేసే అంశాన్ని అమెరికా ప్రభుత్వం (US Government) పరిశీలిస్తోంది. ప్రయోగాత్మకంగా డిసెంబరు నాటికి దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. పర్యాటకులు, నాన్ ఇమిగ్రెంట్ (Non-immigrant) వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద ప్రస్తుతం 185 డాలర్లను చెల్లిస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా 10.4 మిలియన్ల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసింది.







