India: జులై 8లోగా ఇరు దేశాలు ఒక మధ్యంతర ఒప్పందం

దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26శాతం టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపునివ్వాలని, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను భారత్ (India) కోరుతోందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. జులై 8లోగా ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందనీ తెలిపారు. ప్రతీకార టారిఫ్ (Tariffs )లు విధిస్తున్నామంటూ, ఏప్రిల్ 2న భారత ఉత్పత్తులపై అమెరికా (America) అదనంగా 26 శాతం టారిఫ్‌ను ప్రకటించింది. అయితే జులై 9 వరకు అంటే 90 రోజుల పాటు అమలును వాయిదా వేసింది. కానీ 10 శాతం ప్రాథమిక టారిఫ్‌ను కొనసాగించింది.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను వేగవంతం చేసే దిశగా అమెరికా వాణిజ్య మంత్రితో మంచి చర్చలు జరిగాయని మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal ) పేర్కొన్నారు. యూఎస్ ట్రేడ్ రెప్రెజెంటేటివ్ జేమిసర్ గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ (Howard Lutnick )లతో భారత వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ వాషింగ్టన్‌లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చలు సానుకూలంగా నడుస్తున్నాయి. జులై 8లోగా అంటే తొలి దశ చర్చలు ముగింపు గడువు ( సెప్టెంబరు-అక్టోబరు) కు ముందే మధ్యంతర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్ చూస్తోంది.