IMF: పాకిస్తాన్ కు భారీగా ఐఎంఎఫ్ నిధులు..భారత్ ఆందోళన…

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan) కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారీగా నిధులు మంజూరు చేసింది. ఏకంగా 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8,500 కోట్లు) నిధులను విడుదల చేసింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు కాస్త ఊరట కలగనుంది. అయితే, ఈ ఆర్థిక సహాయం భారత్‌కు మరింత ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఐఎంఎఫ్ ఈ నిధులను విడుదల చేయడానికి కొన్ని షరతులు విధించినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇది పాకిస్తాన్‌కు అత్యంత అవసరం. ఈ నిధులతో పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను కొంతవరకు స్థిరీకరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఈ డబ్బును పాకిస్తాన్ ఎలా వినియోగిస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్తాన్ ఈ నిధులను తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరోక్ష యుద్ధంలో ఉంది కాబట్టి.. ఈ నిధులను అటువైపు మళ్లించే అవకాశం ఉందన్నది ఓ మాట. ఇంకొకటి వీటిని చూపిెంచి.. ఇతర దేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకునే పరిస్థితులున్నాయన్న అనుమానాలున్నాయి కూడా.
ఇటీవల కాలంలో భారత్‌పై పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు టర్కీ కూడా సహకరిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ భారీగా నిధులు విడుదల చేయడం పాకిస్తాన్‌కు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో భారత్‌కు మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.