అమెరికాలో మరోసారి కాల్పుల మోత ..ఒకేరోజు

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మేరీల్యాండ్‍లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరొకరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడినట్టుగా భావిస్తున్న అనుమానితుడిని పోలీసులు అక్కడిక్కడే కాల్చిచంపారు. నిందితుడు కాల్పులు జరపడానికి కారణాలు తెలియరాలేదు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్యేర్‍లోనూ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నాలుగేండ్ల చిన్నారి సహా ముగ్గురిపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. వారికోసం గాలిస్తున్నటు పోలీసులు తెలిపారు. దక్షిణ ఫ్లోరిడాలోని ఓ మాల్‍లో రెండు సమూహాల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు అని అధికారులు తెలిపారు.