వారికి అమెరికాలో నో ఎంట్రీ
కొవిడ్ 19 నేపథ్యంలో బ్రెజిల్‌పై ప్రయాణ ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. గత 14 రోజుల సమయంలో బ్రెజిల్లో గడిపిన విదేశీయులను అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించినట్లు వైట్ హౌస్‌లో ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాకి కొత్త కరోనా పాజిటివ్ కేసులు రాకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో ఇప్పటి వరకు 3,63,211 మంది కరోనా బారిన పడిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికా తర్వాత బ్రెజిల్‌లోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 22 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.






