మరి కొంతకాలం కరోనా టాస్క్ ఫోర్స్
వైట్‌హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ మరి కొంతకాలం పాటు కొనసాగనున్నది. దీనికి కొత్త సభ్యులు నియామకం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం చెప్పారు. కొంతకాలం దీన్ని నిర్వహిస్తాం. ఎప్పుడు దీన్ని ముగించాలో పరిశీలిస్తాం. ఎందుకంటే దీని కర్తవ్యం అప్పటికి ఆశాజనకంగా పూర్తవుతంది అని ట్రంప్ వివరించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నాయకత్వంలో జనవరిలో ట్రంప్ దీన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్సు బాగా పనిచేసిందని, నిన్న, ఈరోజు కూడా సమావేశాలు నిర్వహించామని ట్రంప్ చెప్పారు. టాస్క్ఫోర్సుకు చెందిన ఇద్దరు ఆరోగ్య ఉన్నతాధికారులు డాక్టర్ ఆంథోనీ ఫాసి, డాక్టర్ డెబోరా బిర్కస్ సభ్యులుగా కొనసాగే అవకాశం ఉందని ఆయన మీడియాకు తెలిపారు. అధికార యంత్రాంగం ఇది అక్కర లేదని నిశ్చియానికి వచ్చే వరకు టాస్క్‌ఫోర్స్ కొనసాగుతుందని చెప్పారు.






