కరోనా మానవ సృష్టి కాదు : అమెరికా
కరోనా వైరస్ (కోవిడ్ 19) మానవ సృష్టి కాదనీ, దాన్ని చైనా ప్రయోగశాలలో తయారు చేయలేదని అమెరికా చెందిన గూఢాచారి సంస్థలు (నిఘా సంస్థలు) సృష్టం చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా వైరస్ వుహన్ ప్రయోగశాలలో పుట్టించారని గట్టిగా వాదిస్తున్నందున మాత్రమే ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తమ దేశ నిఘా సంస్థలు చెప్పిన దాన్ని సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వసించడానికి సిద్ధం కాకపోవడం విచిత్రం. పైగా చైనా నష్ట పరిహారం చెల్లించాలనీ, దాని కోసం గట్టిగా పట్టుబడతామని ఆయన నొక్కి చెప్పడం గమనార్హం. అయితే, కరోనా కట్టడిలో విఫలమైన ట్రంప్ సర్కారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని తెర మీదకు తెస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ట్రంప్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






