5.25 శాతానికి చేరిన అమెరికా మూల ద్రవ్యోల్బణం

యూఎస్ఏ మూల ద్రవ్యోల్బణం (కోర్ ఇన్‌ఫ్లేషన్) అతి తక్కువకు చేరింది. స్టాటిస్టా గణాంకాల ప్రకారం, 2021 ఏప్రిల్ తర్వాత యూఎస్ఏ మూల ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం అగ్రరాజ్యం కోర్ ఇన్‌ఫ్లేషన్ 5.25 శాతంగా ఉంది. గతేడాది జులై నుంచి 5.5 శాతంగా ఉన్న అమెరికా మూల ద్రవ్యోల్బణం ఇప్పుడు మరింత తగ్గడం గమనార్హం. 1980 తర్వాత ఇలా రెండేళ్ల మధ్య ఇంత తక్కువ తేడా ఉండటం కూడా ఇదే తొలిసారి. సీఎంఈ ఫెడ్‌వాచ్ టూల్ అంచనాల ప్రకారం, సెప్టెంబరులో రేట్ల కోతలు ఉంటాయనే అంచనాతోనే ప్రస్తుత మార్కెట్లు ముందుకెళ్తున్నాయి.