TTA: డల్లాస్‌లో విజయవంతంగా టిటిఎ బోర్డు మీటింగ్

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మే 31, 2025న డల్లాస్, టెక్సాస్‌లో అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెది నాయకత్వంలో బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ ను విజయవంతంగా నిర్వహించింది. అధ్యక్షుడు నవీన్ మల్లిపెద్ది, వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-ఛైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ళ, సభ్యులు భరత్ మాదాడి, శ్రీని అనుగు, గత అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల, ఇసి, బిఓడి, ఎస్‌సి, ఆర్వీపిలు ఈ వేడుకలకు వచ్చారు. అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలు జ్యోతి రెడ్డి దూదిపాలను సంస్థకు కొత్త బోర్డు డైరెక్టర్‌గా నియమించినట్లు ఈ సందర్భంగా టిటిఎ ప్రకటించింది. ఈ సమావేశంలో, అధ్యక్షుడు టిటిఎ మెగా కన్వెన్షన్ తేదీలను అధికారికంగా ప్రకటించారు. ఇది జూలై 17`19, 2026 లో జరుగుతుంది. సేవా దినోత్సవాల ప్రణాళిక ముఖ్య ఎజెండా అంశాలలో ఒకటిగా ఉంది, సేవా దినోత్సవాల కోఆర్డినేటర్ విశ్వా కంది తన ఆలోచనలను బిఓడికి సమర్పించారు.
టిటిఎ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, డిసెంబర్ 2026లో హైదరాబాద్, ఇండియాలోని శిల్పకళా వేదికలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టిటిఎ తీర్మానించింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి డాక్టర్ ఎల్.ఎన్. రెడ్డి దొంతిరెడ్డి గారిని ఛైర్మన్‌గా నియమించారు. టిటిఎ నాయకత్వం మొదటి త్రైమాసికానికి ఉత్తమ స్టాండిరగ్ కమిటీ ఛైర్‌లను మరియు స్టార్ ఆర్వీపిలను కూడా ప్రకటించింది. టిటిఎ అడ్వయిజరీ చైర్ అధ్యక్షుడు, ఇసి, బిఓడి సభ్యులు డల్లాస్ బృందానికి ప్రవీణ్ చింత, విశ్వ కంది, నరేష్ బైనాగరి, వెంకట్ అన్నపరెడ్డి, శేఖర్, సందీప్, మహేష్ మరియు నిశాంత్ ఇతర బృందాలకు డల్లాస్‌లో బిఓడి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.