రోజూ టెస్ట్ చేయించుకుంటా అంటున్న డొనాల్డ్ ట్రంప్
వైట్ హౌస్‌లో సహాయకునిగా పనిచేసే ఓ సైనికదళ జవానుకు కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. టెక్సాస్ గవర్నర్‌తో సమావేశం సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వచ్చిన జవానును తాను కలుసుకోలేదని చెప్పారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల్లో భాగంగా ఇకనుంచి రోజూ పరీక్షలు చేయించుకుంటానని తెలిపారు. ఈ సమావేశంలో ట్రంప్ గానీ, పెన్స్ గానీ మాస్కులు ధరించకపోవడం గమనార్హం. వైట్‌హౌస్‌లో అధ్యక్షుని దగ్గర పనిచేసేవారికి క్రమం తప్పకుండా పరీక్షకానీ కొందరు సిబ్బంది, సీక్రెట్ ఏజెంట్లు మాస్కులు లేకుండా డ్యూటీకి వస్తున్నారు. ఇదివరకైతే వారానికి ఒకసారి పరీక్ష జరిగేది. ఇకనుంచి రోజుకు ఒకసారి పరీక్ష చేయించుకుంటా. అయినా ఏమైనా జరగొచ్చు అని ట్రంప్ అన్నారు.






