TTGA: ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ 2026 నూతన కార్యవర్గం ప్రకటన
అమెరికాలోని నార్త్ కరోలినా (RTP) కేంద్రంగా పనిచేస్తున్న ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ బోర్డును ప్రకటించింది. శ్రీధర్ అంచురి అధ్యక్షుడిగా ఎన్నికవగా, వివిధ విభాగాలకు బాధ్యులను నియమించారు.
TTGA బోర్డు సభ్యులు:
అధ్యక్షుడు & PR: శ్రీధర్ అంచురి
ఉపాధ్యక్షుడు & ఫుడ్: రాజేంద్ర ఆకుతోట
సెక్రటరీ & మెంబర్షిప్ 2: విజయ్ మైలాపూర్
ట్రెజరర్ & ఫెసిలిటీస్ 2: శ్రీకాంత్ బిజ్జల
మెంబర్షిప్: జయప్రకాష్ నన్నా
కల్చరల్ డైరెక్టర్: స్వాతి బశెట్టి
ఈవెంట్ డైరెక్టర్: దుర్గా గండి
యువత డైరెక్టర్: అంబికా పిల్లి
కమ్యూనికేషన్ & మీడియా: అరుణ్ పాలరపు
TAGDV సంక్రాంతి శుభాకాంక్షలు
గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) తన 52 ఏళ్ల వేడుకల సందర్భంగా తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసింది. సంబరాల సంక్రాంతి అందరి జీవితాల్లో సరికొత్త కాంతులు తేవాలని TAGDV ఆకాంక్షించింది.
ముఖ్య సభ్యులు: ప్రెసిడెంట్ తులసి రామ్ మోహన్ రావు తాళ్లూరి, వైస్ ప్రెసిడెంట్ హరీష్ అన్నబత్తిన, సెక్రటరీ సురేష్ బొండుగుల, ట్రెజరర్ మధు బూదాటి ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.






