Houston: హుస్టన్‌లో సంక్రాంతి సంబరాలు.. జనవరి 17న వేడుకలు, రిజిస్ట్రేషన్ ఉన్నవారికే అనుమతి
అమెరికాలోని హుస్టన్ నగరంలో సంక్రాంతి సంబరాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 17న జరగనున్న ఈ వేడుకలకు తెలుగు కమ్యూనిటీ నుండి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు ఆంజనేయులు కోనేరు తెలిపారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఈ సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేడుకల్లో గతంలో కంటే ఎక్కువ ఆటలు (Games), వినోద కార్యక్రమాలు, సామూహిక వేడుకలను ప్లాన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వేదిక: సాయిబాబా ఆలయం, దత్త యోగ కేంద్రం ప్రాంగణం.
సమయం: ఉదయం 8 గంటల నుండి రోజంతా కార్యక్రమాలు కొనసాగుతాయి.
కార్యక్రమాలు: పిల్లలు, పెద్దల కోసం అనేక ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక ఈవెంట్స్ ఉంటాయి. నిన్ననే భోగి మంటల కోసం ఫైర్ ప్లేస్‌ను సిద్ధం చేశారు.
ఆహారం: మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ వంటి రుచికరమైన పదార్థాలు అందించనున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి: భారీ స్పందన దృష్ట్యా, వేదిక వద్ద స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకుని, కేవలం ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వారికి అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ లేని వారు రావద్దని, దీనిని కఠినంగా అమలు చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ అతిథుల వివరాలను వెబ్సైట్లో ఉంచుతామని, సౌకర్యవంతమైన వేడుకల కోసం అందరూ సహకరించాలని కోరారు. భారతదేశంలోని సంక్రాంతి వాతావరణాన్ని హుస్టన్ లోని తెలుగు వారికి అందించడమే లక్ష్యంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు.






