కోవిద్ 19 వేళ ‘టాటా’ సహకారం
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం కోవిడ్ 19 వేళలో తెలుగువారికి ఎన్నో విధాలుగా సహాయపడుతూ వస్తోంది. వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతోపాటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయపడుతోందని టాటా అధ్యక్షుడు భరత్ మాదాడి చెప్పారు. కోవిడ్ 19 వైరస్‌పై అంటువ్యాధుల నిపుణులు, ప్రముఖ డాక్టర్లతో వెబినాయర్ నిర్వహించిన తొలి సంస్థ కూడా తమదేనని ఆయన చెప్పారు. యూ ట్యూబ్ ద్వారా కూడా కోవిడ్ 19కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహను కూడా కల్పించామన్నారు. ఎప్పటికప్పుడు ఈ వైరస్‌కు సంబంధించి సమగ్ర సమచారాన్ని తమ సభ్యులకు అందిస్తున్నామని తెలిపారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కూడా పలు వెబినాయర్లు నిర్వహించి ఇమ్మిగ్రేషన్ విషయాల్లో ఏర్పడిన సందేహాలను తీర్చామన్నారు. కోవిడ్ 19 సంక్షోభం కారణంగా ఉద్యోగం కోల్పోయిన హెచ్1బి వీసాదారులకు, స్టూడెంట్లకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిఞది.
సిపిఎకు సంబంధించి చర్చా కార్యక్రమాలను, పే రోల్ ప్రొటెక్షన్ ప్లాన్, ప్యాకేజి, ట్యాక్స్ డెడ్‌లైన్ వంటి విషయాలతోపాటు ట్రంప్ ప్రభుత్వం?ప్రకటించిన రిలీఫ్ ఫండ్‌కు ఎలా అప్లై చేయాలో, ఎవరు అర్హులో వాటికి సంబంధించి విధివిధానాలను తెలియజేయడం జరిగింది. టాటా ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాము. ఫుడ్, వైరస్‌నుంచి రక్షణకు మాస్క్‌లు, గ్లోవ్స్ల పంపిణీ వంటివి చేశాము. టాటా వ్యవస్థాపకులు మల్లారెడ్డి కోవిడ్ 19 సహాయ చర్యలకోసం తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలతో టాటా కోవిడ్ 19 సంక్షోభ వేళలో తెలుగువారికి సహాయపడుతోంది.






