53వ టెక్సాస్ సాహిత్య సదస్సుకు ఆహ్వానం

ప్రతి ఆరు నెలలకు జరిగే టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సును ఈసారి డాలస్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం సెప్టెంబర్ 21 2024 శనివారం, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు జరుగుతుంది. ఈ సదస్సుకు హస్తిన, సనాతన, గుడివాడ, హయస్థానపుర మరియు డాలస్ సాహిత్యాభిమానులు హాజరై సాహితీ విందును పంచనున్నారు.
అందరూ ఆ రోజు ఈ కార్యక్రమానికి కేటాయించుకోమని మా మనవి. ఈ సమావేశ వివరాలను మీ స్థానిక సంస్థ సభ్యులతోనూ మరియు సాహితీ ప్రేమికులతోనూ పంచుకోగలరు. మీ అందరి రాకతో, సాహితీ ఊసులాటలతో సదస్సును రంజింపచేయాలని కోరుకుంటున్నట్లు తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త, టాంటెక్స్ పాలకమండలి సభ్యులు దయాకర్ మాడ తెలిపారు.
ఈ సదస్సులో ప్రసంగం చేయాలనుకున్నవారు వారి వివరాలను పంపించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.