అట్లాంటాలో ఫైర్ సిబ్బందిని అభినందించిన తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో కోవిడ్ 19 రియల్ హీరోలను అభినందిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా జాన్స్ క్రీక్ ఫైర్‌స్టేషన్ 61 సిబ్బందిని అభినందిస్తూ తానా అట్లాంటా విభాగం నాయకులు వారికి లంచ్ ఇచ్చారు. కోవిడ్ 19 రక్షణలో ముందుంటున్న ఫైర్‌స్టేషన్ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా తానా నాయకులు ప్రశంసించారు. మూడు షిప్టుల సిబ్బందికి లంచ్ అందజేశారు. తానా ఇవిపి అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, వినయ్ మద్దినేనికి ఈ సందర్భంగా తానా అట్లాంటా నాయకులు ధన్యవాదాలు చెప్పారు. అనిల్ యలమంచిలి, సుధాకర్ బొద్దు, మురళీ బొడ్డు, శ్రీరామ్ రొయ్యలపాటు ఎంతోమంది వలంటీర్లు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.






