నాటా ఆధ్యాత్మికం

నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఈ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ హాజరవుతున్నారు. మహాసభల్లో ఆయన మెడిటేషన్‌పై ప్రసంగించనున్నట్లు నాటా మహాసభల ఆధ్యాత్మిక కమిటీ చైర్ సుధాకర్ పెన్నం తెలిపారు.