అందుకే కరోనా నన్ను ఏమీ చేయలేదు!
పాప్ గాయని మడోన్నాకు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందట. అందుకే కరోనా నన్ను ఏమీ చేయలేదు. నా విషయంలో కరోనాకి అంతసీన్ లేదంటున్నారామె. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ జరిగిన విషయాలను క్వారంటైన్ డైరీ పేరుతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంటున్నారామె. ఇటీవలే కరోనా గురించి ఓ అప్ డేట్ను తన అభిమానులతో పంచుకున్నారు మడోన్నా. ఈ మధ్యే కరోనాకి సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను. కరోనాను ఎదిరించే యాంటీబాడీస్ నా శరీరంలో తగినన్ని ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. రేపు ఉదయమే కారు తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్లబోతున్నాను. దారిలో కారు అద్దాలు దించి కోవిడ్ గాలి కూడా పీలుస్తాను. అందర్నీ ఇలా చేయమని చెప్పను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి అని పేర్కొన్నారు మడోన్నా.






