NATS: నాట్స్ సెలబ్రిటీ క్రికెట్ విజేతలు
మొదటి సారి నిర్వహించిన నాట్స్ (NATS) నార్త్ అమెరికా సెలబ్రిటీ క్రికెట్ టోర్నమెంట్‌లో వెంకీ 11 టీమ్ మరియు టంపా టైగర్స్ సంయుక్త విజేతలుగా ప్రకటించబడ్డారు, నాట్స్ యుఎస్‌ఎ 11 రన్నర్-అప్‌గా నిలిచింది. వెంకీ 11 టీమ్‌కు కెప్టెన్లు దగ్గుబాటి వెంకటేష్ మరియు ఎస్‌ఎస్ థమన్ వ్యవహరించారు. టంపా టైగర్స్ కు ప్రహ్లాద్ మాడభూషి, కెప్టెన్ గా ఉన్నారు. నాట్స్ యుఎస్‌ఎ 11 కు ప్రసాద్ ఆరికట్ల కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ టోర్నమెంట్‌లో స్టార్ క్రీడాకారుల పాల్గొనడం, ఉన్నత స్థాయి క్రీడా విలువలు ప్రతిబింబించాయి. ఈ టోర్నమెంట్ పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది.







