KTR: డాలస్‌లో కేటీఆర్ కి బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ఎన్నారైల ఘన స్వాగతం – మహేష్ బిగాల

డాలస్‌లో కేటీఆర్ (KTR) గారికి బీఆర్‌ఎస్ (BRS) శ్రేణులు, తెలంగాణ ఎన్నారైల ఘన స్వాగతం లభించింది ఎటు చూసిన డల్లాస్ అంత తెలంగాణ మయం అయింది, డల్లాస్ అంత గులాబీ మయం అయింది. ఎల్లలు లేని ఆప్యాయత, అభిమానం డాలస్ లో తమ ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారితో ఆప్యాయంగా ముచ్చటించి, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం మహేష్ బిగాల అధ్యక్షతన ఇండియా నుంచి వచ్చిన మాజీ మంత్రులతో, ఎమ్మెల్లెలతో, ప్రముఖులతో మరియు ఎన్నారైల అల్పాహారం సమావేశం జరిగింది. ఈ సమావేశములో కేటీఆర్ గారు అందరితో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అన్ని విషయాలపై చర్చ జరిగింది, అక్కడ పెద్ద ఎత్తున వస్తున్న స్పందన పై హర్షం వ్యక్తం చేశారు. మహేశ్ బిగాల – బీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఎటు చూసిన కేటీఆర్, కేటీఆర్ ఏమీ మాట్లాడుతారో అని డల్లాస్ అంత ఎదురుచూస్తుంది అన్నారు. అలాగే ఈరోజు సభ మహేశ్ తన్నీరు – బీఆర్ఎస్ యుఎస్ఎ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తో సమన్వయం చేస్తూ విజవంతంగా చేస్తామని తెలిపారు. ఈ సమావేశములో కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రులు జి. జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్లేలు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఎన్నారై నాయకులు అందరూ పాల్గొన్నారు.