జుకర్బర్గ్, బిల్ గేట్స్ సంపద పెరిగింది
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా మిలియన్ల మంది అమెరికన్ పౌరులు ఉద్యోగాలు కోల్పోయినప్పటీకి దేశ బిలియనీర్ల సంపద మాత్రం పెరిగింది. ఈ కాలంలో వీరి సంపద మొత్తం 434 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. అమెజాన్ సీఇఓ జెఫ్ బెజోస్ ఆస్తులు 34.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఫేస్బుక్ సిఇఒ మార్క్ జుకర్బర్గ్ సంపదను 25 బిలియన్ డాలర్లు జంప్ అయింది. మొదటి ఐదు యూఎస్ బిలియనీర్లు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, వారెన్ బప్ఫెట్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్ మొత్తం ఆస్తులు 75.5 బిలియన్ డాలర్లు లేదా 19 శాతం చొప్పున పెరిగాయి. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది.






