కోవిడ్ -19 టాప్ 10 దేశాలు ఇవే…
కరోనా బాధిత దేశాల్లో అమెరికా టాప్ 10లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూఎస్ఎలో మొత్తం 16,86,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 19 కారణంగా అగ్రదేశం అమెరికాలో 99,300 మంది ప్రాణాలు కోల్పోయారు. యూఎస్ తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్లో 3,65,213 కేసులు నమోదవగా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 22,746కు చేరుకుంది. మూడోస్థానంలో రష్యా నిలిచింది. రష్యాలో 3,44,481 మందికి కరోనా సోకగా 3,541 మంది మరణించారు. రష్యా తర్వాత స్పెయిన్ నాలుగో స్థానంలో నిలిచింది. స్పెయిన్‌లో 2,82,852 మందికి కరోనా పాజిటివ్ రాగా, 28,752 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ తరువాత ఇంగ్లండ్ ఐదో స్థానంలో కొసాగుతోంది. యూకేలో 2,59,559 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నమోదవగా 36,793 మంది మరణించారు. యూకే తరువాత ఆరోస్థానంలో ఉన్న ఇటలీలో 2,29,858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇటలీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 32,785కు చేరుకుంది. ఫ్రాన్స్ ఈ జాబితాలో ఏడోస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌లో 1,82,584 కేసులు నమోదవగా 28,367 మంది మరణించారు. 8వస్థానంలో ఉన్న జర్మనీలో 1,80,328 పాజిటివ్ కేసులు నమోదవగా 8,371 మంది మరణించారు. 9వస్థానంలో ఉన్న టర్కీలో 1,56,827 కేసులు, 4,340 మరణాలు నమోదయ్యాయి. కరోనా టాప్ 10 దేశాల జాబితాలో 10వ స్థానంలో నిలిచిన భారత్‌లో 1,38,845 పాజిటివ్ కేసులు నమోదవగా సుమారు 4,021 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.






