అమెరికా వేదికగా… గుల్వీర్ సింగ్ జాతీయ రికార్డు
గతేడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల రేసులో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికా వేదికగా జరుగుతున్న పోర్ట్లండ్ ట్రాక్ ఫెస్టివల్లో ఈ ఉత్తర ప్రదేశ్ కుర్రాడు 13 నిమిషాల 18:32 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలవడంతో పాటు నేషనల్ రికార్డునూ బ్రేక్ చేశాడు. గతంలో ఈ ఘనత అవినాశ్ సాబ్లె ( 13:19.30) పేరిట ఉండేది. పోర్ట్లాండ్ ఈవెంట్లో అమెరికా అథ్లెట్ డైలన్ జాకబ్స్ (13:18.8) అగ్రస్థానంలో దక్కించుకోగా భారత్కు చెందిన కార్తీక్ కుమార్ 17వ స్థానంలో నిలిచాడు.







