యాంటీబాడీ టెస్టుల నిర్వహణకు ఎఫ్డీఏఅనుమతి
యాంటీబాడీ టెస్టుల నిర్వహణకు స్విస్ డయాగ్నస్టిక్ దిగ్గజం రోచీకి అమెరికా పుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్డీఏ) విభాగం అనుమతి ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో దీనిని వినియోగించవచ్చని ఎఫ్డీఏ తెలిపింది. రక్త నమూనాలను పరీక్షించి శరీరంలో రోగ నిరోధకాలు (యాంటీబాడీస్) తయారవుతున్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. కరోనా వైరస్ పై పోరాడే యాంటీబాడీలు విడుదలవుతున్నాయంటే ఆ వ్యక్తికి కరోనా అదివరకే సోకినట్లు భావించవచ్చు. అయితే, ఈ యాంటీబాడీల టెస్టుల్లో కచ్చితత్వం ఎంత అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. తాము రూపొందించిన యాంటీ బాడీ టెస్టు పక్రియ నూటికి నూరు శాతం కచ్చితత్వంతో కూడుకున్నదని రోచీ సంస్థ చెప్పుకుంటోంది.






