అమెరికాలో వందేళ్లలో ఈ స్థాయిలో … ఇదే తొలిసారి
అమెరికాలోని అత్యంత జనసాంద్రత ఉండే న్యూయార్క్ నగరంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. దాదాపు 4.2 కోట్ల మంది ప్రజలు భూకంప ప్రభావానికి లోనయ్యారు. అమెరికా తూర్పు తీరంలో గడిచిన వందేళ్లలో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం రాలేదని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజాలోని చిన్నారులు, మహిళల పరిస్థితులపై భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించారు. అదే సమయంలో భూ ప్రకంపనలు రావడంతో సమావేశాన్ని వాయిదా వేశారు.







