వైట్ హౌస్ సిబ్బందిలో ఒకరికి పాజిటివ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ట్రంప్ కూడా వైరస్ బారిన పడేందుకు అవకాశాలున్నాయని సిఎన్ఎన్ వార్తా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పాజిటివ్‌గా తేలింది అమెరికా నావికా సిబ్బందికి చెందిన వ్యక్తిగా తేలింది. ఈయన ప్రస్తుతం అధ్యక్షుడి భవనంలో వైట్‌హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోకి మెరికల్లాంటి మిలటరీ సిబ్బందిని చేర్చుకుంటారు. వీరంతా అధ్యక్షుడి కుటుంబసభ్యులకు సన్నిహితంగా ఉంటారు. బుధవారం ఈ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో ట్రంప్ ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది.






