కరోనాకు ముందు.. ఆ తర్వాత!
చిత్రంలో కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే. పేరు మైక్ ఘాల్జ్. వయసు 43 ఏండ్లు. కాలిఫోర్నియాకు చెందిన మైక్ మార్చిలో కొవిడ్ బారిన పడ్డారు. ఆరువారాల చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఈ ఆరువారాల్లో కరోనా ఆయనను ఎంతలా కుంగదీసిందో పై చిత్రం చూస్తేనే అర్థమవుతుంది. చికిత్స పొందుతున్న సమయంలో ఏకంగా 23 కిలోల బరువు తగ్గారు. చికిత్సకు ముందు కండలు తిరిగి ఉన్న అతని శరీరం బక్కపలుచగా తయారైంది. తనను కరోనా ఎలా ప్రభావితం చేసిందో తెలియజేయడానికి ఆయన ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కరోనా ఎంతటివారినైనా ప్రభావితం చేస్తుంది అనడానికి నేను ఒక ఉదాహరణ. ప్రతిరోజు వ్యాయామం చేసేవాడిని. వయసు కూడా ఎక్కువేం లేదు. కానీ కరోనా బారిన పడ్డాను. వైరస్ నా శరీరాన్ని ఇలా మార్చేసింది. నా ఉపిరితిత్తుల సామర్థ్యాన్ని బాగా దెబ్బతీసింది. అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఆయన అన్నారు.






